నిబంధనలకు విరుద్ధంగా బియ్యం రీసైకిలింగ్
తిమ్మాపూర్, జూలై 16 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్‌గేట్ సమీపంలోని ఒక రైస్‌మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని రీసైకిలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, “గత ప్రభుత్వ హయాంలో మిగిలిన బియ్యాన్ని అక్రమంగా టెండర్‌లో దక్కించుకున్న మిల్లర్, అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో నిల్వల నుండి తరలించి రీపాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఇథనాల్ తయారీకి లేదా పశుగ్రాసానికి ఉపయోగించాల్సిన బియ్యాన్ని...