తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, జూలై 16 (చైతన్యగళం): దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, “నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం నా ప్రధాన లక్ష్యం. గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా ఉండేలా సూచనలు ఇచ్చాను” అని తెలిపారు.ఆయన పేర్కొంటూ, “ప్రస్తుతం ఉన్న తాగునీటి పరిస్థితి, పైప్‌లైన్ల నిర్వహణ, మోటార్ల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం, లీకేజీల నివారణ, మరమ్మతులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాం. వేసవి...