ఎలిగేడు, జూలై 16 (చైతన్యగళం):
ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం మడేలయస్వామి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.గ్రామంలోని 20 కుటుంబాల మహిళలు తలపై బోనాలను ఎత్తుకుని, బైండ్ల పూజారుల డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్‌తో నృత్యాలు చేస్తూ ఊర చెరువుకట్టపై ఉన్న మడేలయస్వామి ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి సమర్పణలు చేసి, టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పూసాల నవీణ్, ఉపాధ్యక్షుడు రాచకొండ మల్లేశ్, నాయకులు రాజేశం, రాములు, లింగయ్య, ఇస్తారి, శ్రీనివాస్, రాకేశ్, పరుశరాములు, రమేశ్, అనిల్, లచ్చయ్య, కనుకయ్య, శ్రీకాంత్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.