హైదరాబాద్, జూలై 16 (చైతన్యగళం): హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 23వ ఎస్ఐపీ అబాకస్ పోటీల్లో కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ఎస్ఐపీ అబాకస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ప్రతిభను చాటారు.
ఈ పోటీల్లో ఇన్స్టిట్యూట్ నుంచి 66 మంది చిన్నారులు పాల్గొని, వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ అవార్డులు అందుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కుమారస్వామి విజేతలకు సన్మానం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని 74 అబాకస్ ఇన్స్టిట్యూట్లలో, కరీంనగర్ మంకమ్మతోట ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ప్లేస్ సాధించడం విశేషం.
ఈ సందర్భంగా ఎస్ఐపీ అబాకస్ మంకమ్మతోట నిర్వాహకులు సబితా రెడ్డి, అశోక్ రెడ్డి, అబాకస్ టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.