ఉద్యోగ మోసానికి మనస్థాపం – యువకుడు ఆత్మహత్య

మర్రిగూడ, జూలై 16 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల శివ (23) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శివ మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు, తుక్కుగూడలో పనిచేస్తున్న భారతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.50 వేల రూపాయలు నగదు, గూగుల్ పే ద్వారా తీసుకుంది. అయితే వాగ్దానం నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తూ, చివరికి బెదిరింపులకు...