జల్ శక్తి అభియాన్ – జల్ సంవిధాన్ పై అవగాహన కార్యక్రమం

దేవరకొండ, జూలై 16 (చైతన్యగళం): దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో జల్ శక్తి అభియాన్ – జల్ సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టే ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.అధికారులు మాట్లాడుతూ, “జల్ సంవిధాన్ స్ఫూర్తితో ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడాన్ని తన సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాలను కాపాడుకోవడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి వృథాను అరికట్టడం అత్యవసరం” అని పిలుపునిచ్చారు.ప్రతి ఇంటిలో వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని,...