దేవరకొండ, జూలై 16 (చైతన్యగళం): దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో జల్ శక్తి అభియాన్ – జల్ సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టే ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.అధికారులు మాట్లాడుతూ, “జల్ సంవిధాన్ స్ఫూర్తితో ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడాన్ని తన సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాలను కాపాడుకోవడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి వృథాను అరికట్టడం అత్యవసరం” అని పిలుపునిచ్చారు.ప్రతి ఇంటిలో వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. “సుస్థిర భవిష్యత్తుకు ప్రజల భాగస్వామ్యమే పునాది” అని అధికారులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ హాన్మంతు సాయి చంద్ర, టిపిబిఓ వర్షిత, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమావత్ సకృ నాయక్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.