జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి ఘన ఏర్పాట్లు

కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం): శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని శుక్రవారం కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉజ్వల పార్క్ సమీపంలోని శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం నుంచి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. కరీంనగర్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. రథయాత్రలో పాల్గొనే భక్తులు తీర్థ...