హయత్‌నగర్ సీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ చేసిన డా. అనురాగిణి రెడ్డి
హయత్‌నగర్, జూలై 16 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా డిసిహెచ్ఎస్ డా. అనురాగిణి రెడ్డి గురువారం హయత్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి ఓపీడి, ఐపీడి వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, ప్రసూతి వార్డు, 108 అంబులెన్స్ సేవలు, శానిటేషన్, డైట్ సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న ఉచిత మందులు, పరీక్షల సౌకర్యం, సిబ్బంది హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ హాజరు, రోగుల ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌ను కూడా తనిఖీ చేశారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ...