శ్రీశైలం, జూలై 16 (చైతన్యగళం):
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి అన్నప్రసాద వితరణ పథకానికి మహబూబ్‌నగర్‌కు చెందిన టి. అనిల్ కుమార్ రెడ్డి గురువారం రూ.1,00,000 విరాళం అందజేశారు.ఈ మొత్తాన్ని పర్యవేక్షకుడు కె. అయ్యన్నకు అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో స్వామి, అమ్మవారి దర్శనం చేయించి దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.భక్తుల అన్న వితరణకు ఈ విరాళం వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.