సెర్ప్ ఎస్‌ఆర్‌డీఎస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: జిల్లా కలెక్టర్ కె హైమావతి
సిద్దిపేట, జూలై 16 (చైతన్య గళం): సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో జిల్లా సెర్ప్, ఎస్‌ఆర్‌డీఎస్ సిబ్బందికి ఎరిక్సన్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్, ఎస్‌ఆర్‌డీఎస్ సిబ్బంది ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. వరి కొనుగోలు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, ఉపాధి...