హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ కె. నారాయణ రెడ్డి

యాచారం, జూలై 16 (చైతన్యగళం): మహేశ్వరం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, గురువారం హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, విచారణాధికారుల పనితీరు, శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు, బీట్ వ్యవస్థ, నేర నియంత్రణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల...