బిజెపి నాయకుడి ఇంటి ముందు ఫ్లెక్సీ చింపివేత – అగంతకుల దుశ్చర్య
కరీంనగర్, జూలై 15 (చైతన్యగళం): బిజెపి నాయకుడు ఏనాగుర్తి ఆంజనేయులు ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి అలజడి సృష్టించారు. ఆయన ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీని అగంతకులు పదునైన వస్తువుతో కట్ చేసి ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానిక బిజెపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాజకీయ కక్షలతోనే ఈ విధ్వంసం జరిగింది” అని వారు ఆరోపించారు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని...