హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

టీజీఈసెట్–2026 స్పాట్ అడ్మిషన్లు జూలై 17న ఏఐ, ఈసీఈ, ఐటీ కోర్సుల్లో ప్రవేశాలు – డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు సువర్ణావకాశం హుస్నాబాద్, జూలై 15 (చైతన్యగళం): ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యంతో ఉన్న డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు శుభవార్త. హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో టీజీఈసెట్–2026 కింద బీటెక్ ద్వితీయ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి జూలై 17న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎలక్ట్రానిక్స్ అండ్...