CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:57 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రేపు కరీంనగర్‌లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

కరీంనగర్, జూలై 15 (చైతన్యగళం): రేకుర్తి సబ్‌స్టేషన్‌లో PMI పనులు, లైన్ మార్పిడి కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రభావిత ప్రాంతాలు: రేకుర్తి, శాతవాహన కాలనీ, వి పార్క్ వెనుకభాగం, పాతవాడ, కొత్తవాడ, కంటి ఆసుపత్రి ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, శేకాబ్ కాలనీ, సమ్మక్క గద్దెలు.

అదే విధంగా 11KV కమాన్ ఫీడర్‌పై నిర్వహణ పనుల కారణంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. ప్రభావిత ప్రాంతాలు: సాషా మహల్, లక్ష్మీనగర్ చౌరస్తా, కోతిరాంపూర్, గాయత్రి నగర్.

వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.