వానలు పడాలే

దండిగా వానలు పడాలే ధరణి మురవాలే వానలు పడాలే వాగు వంకలు నిండాలే!! పచ్చని పైరు పంటలు పండాలే చెరువులు నిండాలే చేపలు దండిగా ఉండాలే బావులు నిండాలే బాగా పంటలు పండాలే!! కర్షకుని కష్టాలు తీరాలే కర్షకుడు కడుపు నిండా తినాలే ధరణిలో దండిగా పంటలు పండాలే అవనిలో అందరూ మురవాలే!! పల్లెలు పచ్చగా ఉండాలే పశువుల గాసం దొరకాలే బాగా వానలు పడాలే బంగారు పంటలు పండాలి వానతో వ్యవసాయం ముందుకు సాగాలి ధరణిలో జనమంతా సంతోషంగా ఉండాలే !! దేవులపల్లి...