నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం
దేవరకొండ, జూలై 15 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా డిండి మండలానికి చెందిన యువ అథ్లెట్ నారిమల్ల ప్రవలిక అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.చైనాలోని ఓర్డోస్ నగరంలో జూలై 9–12 తేదీల్లో జరిగిన తొలి ఆసియా అండర్‑23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‑2026లో మహిళల 4×400 మీటర్ల రిలేలో ప్రవలిక భారత జట్టుతో కలిసి స్వర్ణ పతకం సాధించారు.ప్రవలిక తండ్రి నారిమల్ల రాంబాబు మేస్త్రీగా, తల్లి విజయ కూలీగా పనిచేస్తూ...