CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 5:42 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దేవరకొండ LIC ఏజెంట్ టి. వెంకటేశ్వర్లు మృతి

దేవరకొండ, జూలై 15 (చైతన్యగళం): దేవరకొండ LIC ఏజెంట్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం స్వగ్రామం కూర్మపల్లిలో అకాల మరణం చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాల్ SO LIC మేనేజర్ అరుణ్ కుమార్, లియాఫీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటేరియట్ మెంబర్ గాజుల రాజేష్, సౌత్ సెంట్రల్ జోన్ కోశాధికారి బుడిగ వెంకటయ్య ముదిరాజ్తో కలిసి కూర్మపల్లికి వెళ్లి ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ LIC లియాఫీ బ్రాంచ్ అధ్యక్షుడు అనుగొంటి ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి బద్దెల సత్యనారాయణ యాదవ్, డివిజన్ నాయకులు అహమ్మద్ పాషా, గుణమోని వెంకటేశ్వర్లు యాదవ్, అనుపటి లక్ష్మయ్య, గండూరి మార్కొండయ్య, పల్స శంకరయ్య గౌడ్, క్లియ చైర్మన్ బొడ్డుపల్లి మల్లేశం, ఎం. వెంకటయ్య, ప్రెస్ & పబ్లిసిటీ చైర్మన్ నోముల రాములు, మాల్ SO LIC లియాఫీ అధ్యక్షులు ఎర్పుల రాములు, ముక్కెర శ్రీశైలం, మాకం చెన్నకేశవులు, రామ లక్ష్మయ్య, పెద్దా చారి, సొమ్ల నాయక్, ముద్దం నరసింహ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.