దళిత క్రైస్తవుల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి– డీసీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మకొండ రాజు
ఆమనగల్లు, జూలై 15 (చైతన్యగళం): దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సమాన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని దళిత క్రైస్తవుల హక్కుల పోరాట సమితి (డీసీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మకొండ రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్‌లోని జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల రాష్ట్రస్థాయి మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దశాబ్దాలుగా దళిత క్రైస్తవులు రాజ్యాంగం కల్పించిన హక్కులు,...