విద్యార్థుల భద్రత నాణ్యమైన భోజనంపై కలెక్టర్ హైమావతి ప్రత్యేక దృష్టి

హుస్నాబాద్,జూలై 15 (చైతన్యగళం): జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి, విద్యా సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం హుస్నాబాద్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. వంటగదిలో తయారు చేసిన అన్నం, అలసందకాయ కూర, సాంబారు, పెరుగు, గోంగూర పచ్చడిని పరిశీలించి వాటి నాణ్యతను తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి,...