ఆరోగ్య కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ సమీక్ష

కొంగర కలాన్, జూలై 15 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (IDOC) సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్ డా. కిరణ్మయి వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి‑శిశు ఆరోగ్య సేవలు, జాతీయ టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నియంత్రణ, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, కుటుంబ సంక్షేమం, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, డీ‑వార్మింగ్ డే కార్యక్రమం తదితర అంశాల పురోగతిని ఆమె పరిశీలించారు. వర్షాకాలాన్ని...