CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 4:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పర్యవేక్షణ లేక వెలవెల బోతున్న భవిత కేంద్రం

మర్రిగూడ, జూలై 15 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక, శారీరక వైకల్యాలున్న పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్య మరియు పునరావాస కేంద్రం (భవిత సెంటర్) పర్యవేక్షణ లేక వెలవెల బోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ విద్యార్థులను సెంటర్‌కు తరలించి, వారికి అవసరమైన విద్యా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

“వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తక్షణమే పర్యవేక్షణను బలోపేతం చేసి, సెంటర్‌ను సక్రమంగా నిర్వహించాలి” అని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.