జగిత్యాలను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, జూలై 14 (చైతన్యగళం): జగిత్యాలను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ అవగాహన సదస్సులకు దేశ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు,...