బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలి – సీఐ రంజిత్‌రావు
సుల్తానాబాద్, జూలై 14 (చైతన్యగళం): బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఐ రంజిత్‌రావు సూచించారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, “సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు నిరంతరం పనిచేయాలి. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. నగదు రవాణా సమయంలో నిర్దేశిత భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు. అదేవిధంగా, సైబర్ నేరాల పట్ల...