మృత్యువుతో పోరాడి ఓడిన సాయి తిరుమల్
పాలకుర్తి, జూలై 14 (చైతన్యగళం): పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సాయి తిరుమల్ (28) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. గ్రామంలోని ఐకేపీ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఆయన, సామాగ్రి తీసుకురావడానికి వెళ్తుండగా బైక్ ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లిన సాయి తిరుమల్ 20 రోజులు పాటు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినా ప్రాణాలు నిలవలేదు. కుటుంబం 15 లక్షలు అప్పుచేసి చికిత్స అందించినా ఒక్కగానొక్క కొడుకును కోల్పోవడంతో...