విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలి – సిఐటియు
నల్లగొండ, జూలై 14 (చైతన్యగళం): సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన విధానాన్ని మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం డిమాండ్ చేశారు.మంగళవారం ఎలక్ట్రిసిటీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఎస్‌ఈ కార్యాలయం, ఎలక్ట్రిసిటీ స్టోర్లలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ, “2003లో వాజ్‌పాయ్ ప్రభుత్వం విద్యుత్ చట్టం తెచ్చింది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వేగవంతం చేస్తూ విద్యుత్ సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2025 బిల్లుగా అమల్లోకి తెస్తోంది. ఈ...