మేరా యువభారత్తో యువతకు మరిన్ని అవకాశాలు
కరీంనగర్, జూలై 14 (చైతన్య గళం): కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, యువభారత్ మై భారత్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో 2026–27 సంవత్సరానికి సంబంధించిన జిల్లా అడ్వైజరీ కమిటీ, జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నిర్వహించిన యువజన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక...