చొప్పదండి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి
చొప్పదండి, జూలై 14 (చైతన్య గళం): చొప్పదండి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు...