అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, జూలై 14 (చైతన్యగళం): అమావాస్య సందర్భంగా మిర్యాలగూడ బస్టాండ్‌లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత అల్పాహారం, త్రాగునీటి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ప్రయాణికులకు అల్పాహారం పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మండుటెండలు, ప్రయాణాల మధ్య ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. వాసవి క్లబ్ సభ్యులు నిరంతరం సామాజిక...