- ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న.
గంగాధర,జులై 14 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో గంగాధర ప్రజా కార్యాలయంలో నియామకపు పత్రాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన చిరుత మంగను మహిళా కాంగ్రెస్ పార్టీ కమిటీ గంగాధర మండల అధ్యక్షురాలిగా నియమిస్తూ మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం గంగాధర ప్రజా కార్యాలయంలో నియామకపు పత్రాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గంగాధర మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తనకు అవకాశం కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్,సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుమల్ల మనోహర్,మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య,సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు ముద్దం నగేష్,సర్పంచ్ లు రేండ్ల శ్రీనివాస్,లింగాల లింగయ్య,పడాల రాజన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజ్జుల బాపు రెడ్డి,పడితపల్లి కిషన్,కంకణాల రాజ గోపాల్ రెడ్డి,కర్ర బాపు రెడ్డి,రాచమల్ల,భాస్కర్, మేర్జ కొండయ్య,తోట సంధ్య,పిల్లి మహేష్,సాయిని ఐలయ్య,తాళ్ల శ్రీనివాస్,తాళ్ల సురేష్, సంపత్,దాతు అంజి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.