అమరవీరుడు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం): తెలంగాణ ఉద్యమ అమరవీరుడు, దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కరీంనగర్‌లో పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, కిష్టయ్య సతీమణి పద్మావతి, కుమారుడు రాహుల్, కోడలు వర్ష, కుమార్తె డాక్టర్ ప్రియాంకతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జన్మించిన కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవ కిష్టయ్యను ఆశీర్వదించి, వస్త్రాలు, కానుకలు...