లోయర్ మానేరు డ్యామ్‌ను సందర్శించిన కేటీఆర్
కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం): రైతులకు సాగునీటి భరోసా కల్పించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ను సోమవారం సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. డ్యామ్‌లోని నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్, సాగునీటి అంశంపై పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు...