CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 10:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఓటు హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత

  • ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ సర్‌ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలి
  • ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్

ఐనవోలు, జులై 14(చైతన్యగళం): ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంతో విలువైనదని, దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ అన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి దరఖాస్తుల స్వీకరణ, నమోదవుతున్న వివరాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా నకరకంటి మోహన్ గౌడ్ మాట్లాడుతూ, కొత్తగా ఓటు హక్కు పొందే యువత తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, పేరు మార్పు, చిరునామా మార్పు, తప్పుల సవరణ, ఓటరు జాబితాలో పేర్లు చేర్పు లేదా తొలగింపులకు సంబంధించిన సర్‌ ఫారాలను సకాలంలో నింపి సమర్పించాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ నాయకులు ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రఘు, బి ఎల్ ఏ తాటికాయల ప్రశాంత్, చింత ఏలియా నాతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.