ప్రత్యేక లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోండి – జిల్లా జడ్జి రత్న పద్మావతి

జగిత్యాల (చైతన్యగళం): నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆక్ట్ 1881 ప్రకారం చెక్కులు, ప్రామిసరి నోట్లు, ఇతర బిల్లులకు సంబంధించిన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి జూలై 18న ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి సి. రత్న పద్మావతి తెలిపారు. జగిత్యాల జిల్లా కోర్టులో ప్రస్తుతం దాదాపు 1100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో రూ.5 వేల నుండి రూ.2 లక్షల వరకు విలువ గల 200 కేసులు ఉన్నాయని ఆమె వివరించారు. “చిన్న మొత్తాల కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ...