CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:13 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రత్యేక లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోండి – జిల్లా జడ్జి రత్న పద్మావతి

జగిత్యాల (చైతన్యగళం): నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆక్ట్ 1881 ప్రకారం చెక్కులు, ప్రామిసరి నోట్లు, ఇతర బిల్లులకు సంబంధించిన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి జూలై 18న ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి సి. రత్న పద్మావతి తెలిపారు.

జగిత్యాల జిల్లా కోర్టులో ప్రస్తుతం దాదాపు 1100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో రూ.5 వేల నుండి రూ.2 లక్షల వరకు విలువ గల 200 కేసులు ఉన్నాయని ఆమె వివరించారు. “చిన్న మొత్తాల కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులు వృథా చేసుకోవడం కంటే రాజీ మార్గం ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడం రెండు పక్షాలకు లాభదాయకం” అని జడ్జి సూచించారు.ఈ కార్యక్రమానికి న్యాయవాదులు సహకరించాలని ఆమె కోరారు.సమావేశంలో అదనపు జిల్లా జడ్జి సునీత రవీందర్ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు మర్రిపెల్లి సత్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శి అందే మారుతి, న్యాయవాదులు బండ భాస్కర్ రెడ్డి, రాచకొండ శ్రీరాములు, పాలకుర్తి ఆంజనేయులు, గోవిందుల రాజన్న తదితరులు పాల్గొన్నారు.