శ్రీ వాసవి దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
ఫరూఖ్‌నగర్, జూలై 14 (చైతన్యగళం): అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘానికి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు హాజరై తమవంతు సహకారం అందించారు. సమాజహితమే ధ్యేయంగా సాగిన ఈ సేవా కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్థిక సహకారం అందించిన దాతలు శ్రీ పలబట్ల శ్రీనివాసరావు...