అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోపూజ

షాద్‌నగర్, జూలై 14 (చైతన్యగళం): అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్‌లోని చౌడమ్మ గుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, గోవులకు పండ్లు, కూరగాయలు సమర్పించి ఆహారంగా అందజేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు గుంత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గజవాడ యశ్వంత్ రాజ్, వనితక్క అధ్యక్షురాలు చంద్రిక మాట్లాడుతూ, “గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. అమావాస్య రోజున గోపూజ చేయడం ఎంతో విశిష్టమైనది....