CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 2:46 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోపూజ

షాద్‌నగర్, జూలై 14 (చైతన్యగళం): అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్‌లోని చౌడమ్మ గుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, గోవులకు పండ్లు, కూరగాయలు సమర్పించి ఆహారంగా అందజేశారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు గుంత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గజవాడ యశ్వంత్ రాజ్, వనితక్క అధ్యక్షురాలు చంద్రిక మాట్లాడుతూ, “గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. అమావాస్య రోజున గోపూజ చేయడం ఎంతో విశిష్టమైనది. గో సంరక్షణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం” అని తెలిపారు.

కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు కల్వ మాణిక్యం, గడ్డం నందకిషోర్, గుగ్గిల్ల బాల రాజేష్, గుడిపల్లి రమణ, సురేష్, సామాజిక కార్యకర్త నీల రవీందర్, గడ్డం ఆంజనేయులు, సిగపాక లక్ష్మయ్య, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.