చిట్టి నారుకు ప్రాణం పోయాలి… వాన కోసం ఎదురు చూస్తున్న రైతన్న.

నింగి కనురెప్పలు మూసుకున్నాయో ఏమో... వానచినుకుల జాడే లేదు... పుడమి తల్లి గుండె పగుళ్లతో విలవిల్లాడుతుంటే, నారు మడుల్లో పచ్చని ప్రాణాలు ఎండగాలికి తలవంచుతున్నాయి...! ఎల్‌నినో ఎండల ఎగతాళిలో రైతన్న ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. తొలకరి వాన పలకరించినా భూమి దాహం తీరలేదు... పచ్చని భవిష్యత్తు ఇంకా చిగురించలేదు. ఆకాశం నల్లని మేఘాల చీర కట్టినా, మెరుపులు మెరిసినా, ఉరుములు గర్జించినా, చినుకుల కరుణ మాత్రం కురవలేదు... గడ్డిపోచ చివరనైనా నీటి ముత్యం మెరవలేదు. ఆషాఢం వచ్చిందంటే పొలాల్లో పచ్చదనం పరవళ్ళు తొక్కాలి... కానీ ఈసారి...