భూముల రీ సర్వేకు అందరూ సహకరించాలి – ఆర్డీవో గంగయ్య
ఎలిగేడు, జూలై 14 (చైతన్యగళం): భూముల రీ సర్వేలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పిలుపునిచ్చారు. ఎలిగేడు మండలంలోని లోకపేట గ్రామంలో గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, పట్టా భూములపై రీ సర్వే అంశంపై గ్రామసభ జరిగింది.ఈ సందర్భంగా ఆర్డీవో గంగయ్య మాట్లాడుతూ, “రీ సర్వే విధానం పారదర్శకంగా జరుగుతుంది. గ్రామస్థులకు ఉన్న అపోహలను తొలగించాలి. భూముల రికార్డులు సక్రమంగా ఉండటం భవిష్యత్తులో వివాదాలను నివారిస్తుంది” అని వివరించారు.కార్యక్రమంలో పెద్దపల్లి డీఐ, తహసీల్దార్ యాకన్న, సర్పంచ్ రాధ గంగా...