కార్పొరేట్ ఆసుపత్రి పై చర్యలకు ఏఐఎఫ్బి డిమాండ్
కరీంనగర్ (చైతన్యగళం): నగరంలోని సన్‌షైన్ హాస్పిటల్ నిర్వహణలో తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బి) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారికంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ, సన్‌షైన్ హాస్పిటల్‌లో ఎన్డిపిఎస్ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నివేదికలో తేలిందని పేర్కొన్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్...