చిన్న వయసులోనే విశిష్ట సాహిత్య ప్రతిభ – వర్షిత్‌కు కలెక్టర్ అభినందనలు
కరీంనగర్, జూలై 14 (చైతన్య గళం): చిన్న వయస్సులోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో ద్విభాషా పాటలు, కవితలు రచించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జవహర్ నవోదయ విద్యాలయం, చొప్పదండి విద్యార్థి వర్షిత్ సనమల్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అభినందించారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన వర్షిత్ తన సాహిత్య ప్రతిభతో వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే సృజనాత్మక రచనలతో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు...