2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి – టీపీటీఎఫ్
హైదరాబాద్, జూలై 14 (చైతన్యగళం): ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును తెలంగాణ సచివాలయంలో కలిసింది. శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యం చేసింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, “2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, నూతన ఆరోగ్య పథకం మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలి. పెండింగ్ డీఏలను విడుదల...