తోటపల్లి–ఎల్లికట్ట రహదారి పనులు వెంటనే చేపట్టాలి – తల్లోజు ఆచారి
కల్వకుర్తి, జూలై 13 (చైతన్యగళం): కల్వకుర్తి మండలంలోని తోటపల్లి–ఎల్లికట్ట రహదారి దుస్థితిని నిరసిస్తూ, రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ మండల అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ, “ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం” అని విమర్శించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రహదారి పనులు ప్రారంభించాలని...