CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 9:38 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తోటపల్లి–ఎల్లికట్ట రహదారి పనులు వెంటనే చేపట్టాలి – తల్లోజు ఆచారి

కల్వకుర్తి, జూలై 13 (చైతన్యగళం):
కల్వకుర్తి మండలంలోని తోటపల్లి–ఎల్లికట్ట రహదారి దుస్థితిని నిరసిస్తూ, రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ మండల అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ, “ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం” అని విమర్శించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రహదారి పనులు ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. “లేనిపక్షంలో కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నర్సింహ, నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి, కృష్ణ గౌడ్, సురేందర్ గౌడ్, శ్రీశైలం, బాలకృష్ణ, రాజశేఖర్, రమణ గౌడ్, లక్ష్మారెడ్డి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.