CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 2:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వెల్దండ, జూలై 13 (చైతన్యగళం): వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం, ఆరుద్ర నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించారు.

దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సంతోష్ శర్మ, నరహరి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.