శివపల్లిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణరావు
ఎలిగేడు, జూలై 13 (చైతన్యగళం): ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్థానిక నాయకులతో కలిసి రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.గ్రామ సర్పంచ్ దుగ్యాలవాణి గోపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్ రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామాభివృద్ధి దిశగా నిధులు...