రాంరెడ్డిపల్లిలో విలేజ్ ఆర్గనైజేషన్ భవన శంకుస్థాపన
మర్రిగూడ, జూలై 13 (చైతన్యగళం): మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సంఘాల బలోపేతానికి, వారి కార్యకలాపాలు మరింత ముమ్మరంగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ (వివో) భవనానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో మున్నయ్య పాల్గొని శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎదగడానికి వివో భవనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇకపై గ్రామ మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు–వ్యాపార లావాదేవీలు, ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులు...