కరీంనగర్, జూలై 13 (చైతన్యగళం):
నిర్వహణ పనుల కారణంగా మంగళవారం (జూలై 14) కరీంనగర్ పట్టణం, రూరల్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
* ఉజ్వల పార్క్ ఫీడర్ (రూరల్): ఉదయం 9.00–11.30 గంటల వరకు. ప్రభావిత ప్రాంతాలు: శ్రద్ధాయిని హోటల్ ఏరియా, ఎన్టీఆర్ విగ్రహం, డి-మార్ట్, బైపాస్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల పరిసరాలు.
* రేకుర్తి సబ్‌స్టేషన్: ఉదయం 9.00–మధ్యాహ్నం 1.00 వరకు. ప్రభావిత ప్రాంతాలు: రేకుర్తి, ఐ హాస్పిటల్, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, షేకబ్ కాలనీ, సీతారాంపూర్, జగిత్యాల రోడ్డు, ఆర్టీసీ కాలనీ, గౌడాస్ కాలనీ, సమ్మక్క గద్దెలు.
* రామచంద్రపూర్ ఫీడర్ (టౌన్): ఉదయం 9.00–11.30 వరకు. ప్రభావిత ప్రాంతాలు: రామచంద్రపూర్ కాలనీ, ఆర్‌సీపీ బైపాస్, సప్తగిరి కాలనీ, సాయిబాబా ఆలయ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, ఏఓఎస్ కాలనీ, లహరి అపార్ట్‌మెంట్, వెంకటాద్రి కాలనీ, నోబెల్ స్కూల్ ప్రాంతం.
* వావిలాలపల్లి సబ్‌స్టేషన్ (టౌన్): ఉదయం 9.00–11.00 వరకు. ప్రభావిత ప్రాంతాలు: సంతోష్‌నగర్, భాగ్యనగర్, జ్యోతినగర్, కార్పెంటర్ సొసైటీ, విద్యానగర్, శ్రీరాంనగర్, కొత్తయేశ్వాడ, విజయదుర్గ కాలనీ, చైతన్యపురి.
* సాతవాహన, బద్దిపల్లి సబ్‌స్టేషన్లు (రూరల్): ఉదయం 9.00–మధ్యాహ్నం 2.00 వరకు. ప్రభావిత ప్రాంతాలు: చింతకుంట, బద్దిపల్లి, నాగుల మల్లియాల్, కమాన్‌పూర్, ఖాజీపూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలు, గ్రానైట్ పరిశ్రమలు.
* బ్యాంక్ కాలనీ సబ్‌స్టేషన్ (టౌన్): ఉదయం 9.00–11.00 వరకు. ప్రభావిత ప్రాంతాలు: తేజా స్కూల్, విద్యాధరి స్కూల్, రెడ్డి ఫంక్షన్ హాల్, బూత్ బంగ్లా, గుండు హనుమాన్ ఆలయం, హిందూపురి కాలనీ, ఆర్టీసీ వర్క్‌షాప్, మెహర్‌నగర్.
* పీటీసీ ఫీడర్ (టౌన్): ఉదయం 9.00–11.00 వరకు. ప్రభావిత ప్రాంతాలు: పీటీసీ, బుల్ స్టేషన్, శ్రీహరినగర్, సంతోష్‌నగర్, కుర్మవాడ, డెయిరీ వెనుక ప్రాంతం, వినాయకనగర్, రాంనగర్.
వినియోగదారులు విద్యుత్ సరఫరా అంతరాయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.