జమ్మికుంట 15వ వార్డులో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
జమ్మికుంట, జూలై 13 (చైతన్యగళం): జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మండలంలోని 15వ వార్డు కేశవపూర్ కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి 15వ వార్డు కౌన్సిలర్ పాతాకాల మౌనిక అనిల్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులకు నూలిపురుగుల నివారణ ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించారు.